నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి..దానికి ప్రభుత్వం సహాయం చేయాలని ఓ నర్సు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంది. ఆ నర్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..చైనాలోని వూహాన్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనాను ఓ వైపు.. పెనుసవాల్‌గా మారిన క్రమంలో డాక్టర్లు..నర్సులు..వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ సేవలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాపించిన బాధితులకు సేవలు చేస్తున్న నర్సు నాకొక బాయ్ ఫ్రెండ్ కావలెను’ అని నేరుగా చైనా ప్రభుత్వాన్నే కోరింది. ఒకవైపు డ్యూటీ..మరోవైపు కరోనా రోగులకు సేవలు ఈ రెండింటి నడుమ టియాన్ ఫాంగ్‌ఫాంగ్ (30) అనే నర్సు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నేను బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కునే పనిలో ఉన్నాను. ఆ సమయంలో దేశంలో కరోనా మహ్మమ్మాది బెడద వచ్చి పడింది. దీంతోనేను నా నర్స్ డ్యూటీని అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఈ ప్రమాదం తప్పిన తరువాత నాకు బాయ్ ఫ్రెండ్ ప్రొవైడ్ చేయటంలో ప్రభుత్వం సహాయం చేయాలంటూ కోరింది. (భారత్‌లో కరోనా కల్లోలం.. 18కి చేరిన కేసులు)
అంతేకాదు ప్రభుత్వానికి ఆమె చేసిన బాయ్ ఫ్రెండ్ విన్నపంలో మరో చిన్న ఆఫర్ కూడా ఇచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి అంతం అయ్యాకే తన కోరికను ప్రభుత్వం తీర్చాలనే సడలింపు కూడా ఇచ్చింది. ఈమేరకు మెసేజ్ తో కూడిన ఓ లెటర్ చూపిస్తూ.. హ్యాజ్‌మ్యాట్ సూట్‌లో, కళ్లకు గాగుల్స్ పెట్టుకొని ఆమె ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘‘కరోనా గండం తప్పుతుంది. మంచిరోజులు వస్తాయనే ఆశాభావాన్ని ప్రజల్లో వ్యాపింపజేసేందుకే నాకు ఆజానుబాహుడైన బాయ్‌ఫ్రెండ్‌ను వెదకాలని ప్రభుత్వాన్ని కోరాను’’ అని టియాన్ చెబుతోంది.