సెక్స్ లైఫ్ మీద అమ్మాయిలు ఎందుకు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు?: స్టడీ ఏం చెబుతోంది?

ఎందుకు నా వంక అదోలా చూస్తున్నారు? నేను బాగున్నానా? ఆ హీరోయిన్‌లా నేనెందుకు లేను? ఎప్పుడూ ఎవరితోనో పోలిక, నేను ఎలా కనిపిస్తున్నాను? ఇదే టెన్షన్. ఈ కాలం కుర్రకారుకి అర్ధంకాని సమస్య ఇది. భారతదేశంతో సహా, చాలాదేశాల్లో సరైన సెక్స్ ఎడ్యుకేషన్ విధానం లేదు. సెక్స్ అనగానే తప్పు, నైతికత అంటూ పెద్ద గందరోళం. అంతేనా? నీకు రొమాన్సా? అంటూ హేళన చేస్తారు, సిగ్గుపడేలా చేస్తారు.  

journal Fertility and Sterilityలో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, అమ్మాయిల్లో రొమాంటిక్‌గా లేనేమోనన్న భావన ఎక్కువవుతోంది. శృంగారం పట్ల కోరిక, వాంఛ, భావప్రాప్తి అన్నింటి మీద సవాలక్ష సందేహాలు. ఈ ఒత్తిడి కమ్మేస్తోంది. జాబ్ చేయాలి.. పదిమందిని ఫేస్ చేయాలి. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ఈ చిక్కుల ఒత్తిడిలో జీవితంలో రొమాన్స్ ఛాన్స్ ఎక్కడ? అందుకే చాలామంది అమ్మాయిలు సెక్స్ లైఫ్ మీద వర్రీ.

అసలు ‘sex’అన్న పదం వింటేనే చాలా మంది ముఖం చిట్లించుకొంటారు. ఏం మాట్లాడరు. అదేదో పడకగది యవ్వారమన్నట్లుగానే భావిస్తారు. ఇక దాని గురించి తెలుసుకోవాలనుకునే అమ్మాయిల పరిస్థితి ఏంటి. ఎక్కడో.. ఎవరో విన్న సంగతి చెప్తే తెలుసుకోవడమే. దానివల్ల యువతకు వచ్చేది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే. లేదంటే తప్పుడు సమాచారం. అందుకే వాళ్లలో గందరగోళం. 

ఫలితంగా చాలామంది sexually transmitted diseases (STDs), sexually transmitted infections (STIs) గురవుతున్నారంట. కుర్రకారులో, ముఖ్యంగా అమ్మాయిల్లో సెక్సువల్ లైఫ్ మీద ఒత్తిడుంది. ఆస్ట్రేలియాలో Monash University చేసిన స్డడీ ఈ వాదననే రుజువులనచ్చింది. ఈ సర్వే ప్రకారం  8-39 ఏళ్ల మధ్యనున్న ఆస్ట్రేలియా మహిళల్లో సగం మందికి ఎంతోకొంత personal sexual distress ఉంది. అంటే నా బాడీషేప్ బాగాలేదన్న ఫీలింగ్, లేదంటే భాగస్వామితో సంతృప్తి చెందకపోవడం, లేదంటే అసలు వాంఛే లేకపోవడం చాలామందికి ఉన్న సమస్య. 

వీళ్లకు sexual self image చాలా తక్కువ. అంటే పార్టనర్ కు నచ్చే బాడీ లేదోమోనన్న ఫీలింగ్ ఎక్కువగా బాధిస్తోంది. అసలు తాము బ్యూటిఫుల్ కాదన్న ఫీలింగ్ రావడమేంటి? అలా ఎందుకనిపిస్తోందంటే.. కారణం సినిమాలు, యాడ్స్ అని చెబుతున్నారు నిపుణులు. సినిమాల్లో హీరోయిన్ మెరిసిపోతూ, సన్నగా, అందంగా లేడిగా కదులుతూ కనిపిస్తుంది. ఇక మ్యాగజైన్స్ అన్నీ సెక్సువల్ విమెన్ అంటూ కొన్ని అందాలను కొలతల ప్రకారం చూపిస్తున్నాయి. అసలు అమ్మాయిలంటే అలాగే ఉండాలేమోనన్న ఆత్మన్యూనత భావనలోకి వెళ్లిపోతున్నారు అమ్మాయిలు. 

‘not good enough’,‘not desirable enough’అన్న ధోరణి అమ్మాయిలది.  Fertility and Sterility journalలో పబ్లిష్డ్ స్టడీ ప్రకారం, సెక్యువల్‌గా తక్కువవాళ్లమన్న ఫీలింగ్ పడకగది సామర్ధ్యాన్ని కూడా దెబ్బతీస్తుందంట. 

దీనికి భిన్నంగా, అమెరికాలో 3వేల మంది మహిళల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించిన సైకాలజిస్ట్‌లు మరో కోణాన్ని కనిపెట్టారు. శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం…కొత్తగా ట్రై చేస్తున్నాం, ప్రతిరాత్రి వసంత రాత్రి అనే మహిళల్లో సెక్సువల్‌గా చురుగ్గా లేనివారికన్నా menopause 28శాతం ఆలస్యంగా వస్తోందంట. అంటే యాక్టీవ్ సెక్సువల్ లైఫ్‌కు మేనోపాజ్ కు మధ్య సంబంధమున్నట్లే!

ట్రెండింగ్ వార్తలు