అమెరికాపై కరోనా దెబ్బ..యూవర్శిటీలకు తాళం..ఎగ్జామ్స్ రద్దు,ఆన్‌లైన్ లోనే టీచింగ్

  • Publish Date - March 11, 2020 / 09:44 AM IST

కరోనా భూతం ఏ సంస్థలను విడిచిపెట్టటంలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలతో పాటు విద్యా రంగంపై కూడా పడింది. కరోనా భయంతో స్కూల్స్ కాలేజీలతో పాటు ఏకంగా యూనివర్శిటీలను కూడా మూసివేస్తున్నారు. దీంతో విద్యార్దులు సకాలంలో కోర్స్ లు పూర్తికావని..దీంతో పరీక్షలు ఎలా రాయాలని ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో అమెరికాలోని కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధులకు అటువంటి భయం అక్కర్లేదనీ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కాలేజీలకు రావద్దని..పాఠాలను ఆన్ లైన్ ద్వారానే తెలుసుకోవాలని..విద్యార్ధులకు పాఠాలు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తామని తెలిపాయి. దీంతో విద్యార్ధులకు కాస్త ఊరట లభించింది.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ అమెరికాకు వ్యాపించింది. దీంతో కాలిఫోర్నియా యూనివర్శిటీలతో సహా దానికి సంబంధించి కాలేజీలన్నింటిని మూసివేసింది ప్రభుత్వం. దీంతో క్లాసులు రద్దయిపోయారు. దీంతో విద్యార్ధులు కోర్స్ లు కంప్లీట్ కాకపోవటంతో ఎగ్జామ్స్ ఎలా రాయాలని ఆందోళన చెందటంతో వర్శిటీలు ఇలా ఆన్ లైన్ టీచింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రాజెక్టు వర్క్ లు కూడా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నాయి. 

ఈ క్రమంలో మంగళవారం (మార్చి9,2020)న  కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ..హార్వర్డ్ యూనివర్శిటీలు తమ విద్యార్ధులను వర్శిటీలకు రావద్దని క్లాసులు ఆన్ లైన్ ద్వారా ఫోలో అవ్వాలని సూచించింది.  వీటితో పాటు కొలంబియా విశ్వవిద్యాలయం, ప్రిన్స్టన్ వర్శిటీ, స్టాన్ఫోర్డ్,ఒహియో స్టేట్ వర్శిటీ, వాషింగ్టన్ వర్శిటీలు కూడా దీన్నే ఫాలో అవుతున్నాయి. 

న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ వర్శిటీ వచ్చే వారం నుంచు సెమిస్టర్ కు సంబంధించి అన్ని స్పీచ్ లు, సెమినార్లు,కోర్సులు ఇలా అన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. ఏప్రిల్  వరకూ ఇదే కొనసాగుతుందని తెలిపింది. తరువాత పరిస్థితిని బట్టి ఆన్ లైన్ టీచింగ్ ను కనొసాగించాలా? వద్దా అనే విషయంపై ఆలోచిస్తామని తెలిపింది. 

ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాంటాక్లారా కౌంటీలోని స్టాన్ఫోర్ట్ వర్శిటీ లో డజన్ల కొద్దీ కరోనా వైరస్ సోకిన పలు కేసులు నమోదయ్యాయి.  దీంతో ఈ సీజన్ లో లాస్ట్ సెమిష్టర్ రెండు వారాలపాటు క్లాసులను రద్దు చేసింది.  

చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 110 కి పైగా దేశాలు, ప్రాంతాలు లేదా భూభాగాలకు వ్యాపించింది మరియు 100,000 మందికి పైగా సోకింది. వైరస్ కారణంగా 4,000 మందికి పైగా మరణించారు.

See Also | కరోనా దెబ్బకు ఇటలీకి తాళం : నిర్భందంలో వందలాది తెలుగు విద్యార్థులు