Mahat Raghavendra : తండ్రి అయిన నటుడు మహత్ రాఘవేంద్ర..

యంగ్ యాక్టర్ మహత్ రాఘవేంద్ర తండ్రయ్యాడు.. ఆయన భార్య ప్రాచీ మిశ్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు..

Actor Mahat Raghavendra And Prachi Mishra Welcome A Baby Boy

Mahat Raghavendra: యంగ్ యాక్టర్ మహత్ రాఘవేంద్ర తండ్రయ్యాడు. ఆయన భార్య ప్రాచీ మిశ్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తమిళ్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహత్.. తెలుగులో ‘బ్యాక్‌బెంచ్ స్టూడెంట్’, ‘లేడీస్ & జెంటిల్‌మెన్’, ‘రన్’ వంటి సినిమాల్లో నటించాడు.

బాబు పుట్టిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఫ్యామిలీ ఫొటోను ప్రేక్షకులతో పంచుకున్నాడు మహత్.. ‘క్యూట్ లిటిల్ బాయ్‌తో దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు. ప్రాచీ, నేను చెప్పలేనంత ఆనందంగా ఉన్నాం.. మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్‌కి చాలా థ్యాంక్స్.. నాన్న కావడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేశాడు మహత్ రాఘవేంద్ర.