Nandamuri Balakrishna Ramzan Wishes
Happy Eid: నేడు (మే 14) రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు..
‘‘ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు.. త్యాగానికి, సేవా నిరతికి మారుపేరు రంజాన్ పవిత్రమాసం.. ఎంతో భక్తిశ్రద్ధలతో, కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాణ్ణి కొలవడం ఆదర్శప్రాయం.. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో క్రొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని.. సమసమానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.. మీ బాలకృష్ణ..’’ అంటూ వీడియో ద్వారా రంజాన్ విషెస్ చెప్పారు బాలయ్య..
Balayya : హిందూపూర్ కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన మందులు పంపిన బాలయ్య..
ప్రతి ఏడాది రంజాన్ మాసంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్నహిందూపూర్ నియోజకవర్గంలో స్థానిక ముస్లిం ప్రజలు ఏర్పాటుచేసే ఇఫ్తార్ విందులకు, వారు జరుపుకునే శుభాకార్యాలకు విధిగా హాజరవుతూ.. ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఇచ్చే బాలయ్య గతేడాది అలాగే ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా రంజాన్ వేడుకలకు హాజరు కాలేకపోయారు..
Ramadan wishes from our LEGEND <3 pic.twitter.com/PwWHvQFUUF
— Balayya Yuvasena (@BalayyaUvasena) May 14, 2021