Cervical Spondilosys
Cervical Spondylosis: సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా సెర్వికల్ ఆస్టియో ఆర్థరైటిస్‌ను మెడ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది సాధారణంగా మెడ (సెర్వికల్ వెర్టెబ్రా) ప్రాంతంలో ఎముకల అరుగుదల వలన ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పికి దారితీస్తుంది. వ్యక్తి రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. మెడ ఆర్థరైటిస్‌కు సంబంధించిన కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాం.
స్పాండిలోసిస్ తలనొప్పితో పాటు గాయానికి కూడా దారితీయొచ్చు. వీటి నుంచి ఉపశమనం కోసం యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ఉత్తమమైన పరిష్కారం. మీ రొటీన్ లైఫ్ లో చేర్చుకోవడం బెటర్.
భుజాంగాసనం
ధనురాసనం
మర్జార్యాసనం
సేతు బంధాసనం
మత్స్యాసనం
Read Also: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
జనరల్ గా ఇది పెద్ద వయసులో వాళ్ళకి రావాల్సిన పరిస్థితి. వయసుతో పాటూ ఎముకలు బలహీనపడి, జాయింట్స్ దగ్గర అరిగిపోయి వచ్చే పరిస్థితి. కానీ, ఈ డిజార్డర్ కి వేరే కారణాలు కూడా ఉన్నాయి. మెడ దగ్గర దెబ్బ తగలడం, మెడ మీద స్ట్రైన్ ఎక్కువ ఉండడం, మెడని ఒక పొజిషన్ లోనే పెట్టి ఉంచడం వంటివన్నీ ఈ డిజార్డర్ కి కారణాలే.