Forgiveness
Forgiveness: అంతకుముందు విని ఉండకపోవచ్చు.. లేదా వేరే విధంగా తెలిసి ఉండొచ్చు. కానీ, నిజమేమిటంటే ఇతరులపై ద్వేషం పెంచుకోవడం, మనసులో ప్రతీకారేచ్ఛను పెంచుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. దానికి బదులు తప్పులను క్షమిస్తూ పోతే సమస్యను అక్కడితో ఆపేసినట్లు అవుతుంది. అలా కాకుండా పొరపచ్చాలు వచ్చిన తర్వాత ఇక వారితో మాట్లాడకూడదని నిర్ణయించుకుంటే దాని గురించి దాదాపు గంట లేదా రెండు గంటలపాటు ఆలోచిస్తూనే ఉంటారట.
మరి మన్నించడం వల్ల కలిగే ప్రయోజనం:
ఒక వ్యక్తిని మన్నించడం కోసం ఏం చేయాలి. ముందుగా ఆ విషయం కోసం మీరేం చేయగలరో డిసైడ్ అవ్వండి. దయతో ఆలోచించినప్పుడు ఎదుటివ్యక్తి మీ క్షమాపణకు అర్హుడా కాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని దుర్భాషలాడిన వ్యక్తిని క్షమించాలని ఎందుకు అనుకోవాలి అనే భావనను తీసి పక్కనపెట్టేయండి.
అలా కాకుండా దీర్ఘకాలికంగా ఉండే కోపం మీ రోగ నిరోధక వ్యవస్థపై, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరొక వ్యక్తి పట్ల మీరు భావించే చెడును విస్మరించినప్పుడే మీలోపలి ఆందోళన తగ్గుతుంది. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై నేరుగా ప్రభావితం చేస్తుంది. చెడుగా భావించే జ్ఞాపకాలు తరచూ కలవరపెడుతూ బాధకు ప్రేరేపిస్తుంటాయి.
…………………………………….. : కసరత్తులు లేకుండా బరువు తగ్గటం ఎలాగో తెలుసా?..
కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో లైసెన్స్‌డ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్ షీలా అడిసన్ దీని గురించి ఇలా అన్నారు. జరిగిన చేదు అనుభవం గురించి పదేపదే చర్చించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని తెలుసుకున్నాం. పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది ఒక రకమైన ఆలోచనలను పునరావృతం చేసే చర్య. పదేపదే ఆలోచనల్లోకి చొరబడి ఆందోళనను పెంచుతుంది. అందుకే ఎదుటి వ్యక్తి తరపు నుంచి ఆలోచించకుండా కేవలం పాజిటివ్ ఆలోచనలతో మీరే క్షమించేయండి.
క్షమించాల్సిన అవసరం లేనిదెప్పుడంటే..:
ఓ వ్యక్తిపై కోపంతో లేదా ద్వేషంతో ఉంటూ దాని నుంచి ఉపశమనం కోసం జాగింగ్ లేదా యోగా వంటివి చేస్తున్నారంటే క్షమించాల్సిన అవసరం లేదు. కానీ, పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల విరుద్ధమైన ఆలోచనలతో మదనపడుతుంటే తప్పదు మరి. దీనిని మరీ 1 నుంచి 10 రేటింగ్ ఇచ్చుకుని చూసుకోండి. నిజంగానే ఆ తప్పు క్షమించరానిదైతే మీ జీవితంలో మంచి మార్పు తీసుకొచ్చేదే అయితే క్షమాపణకు దూరంగానే ఉండండి.
………………………………………. : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…
కోపం రావడానికి కారణమైన విషయాన్ని పేపర్ పై ఉంచండి. ఇరు వైపుల నుంచి ఆలోచించి సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోండి. మీదే తప్పైతే నిరభ్యంతరంగా మన్నింపు అడగండి. అలా కాని పక్షంలో అక్కడితో ముగించాలని అనుకుంటే మాత్రమే మీరే మన్నించండి. అటువైపు నుంచి సానుకూల దృక్పథం లేకుంటే ఏదైనా వస్తువును బహుమతిగా ఇవ్వండి. లేదంటే కాసేపు ఆ వ్యక్తితో కలిసి గడిపేందుకు ప్రయత్నించండి. ఆ సమయంలో ఆ తప్పును మరోసారి చేయకూడదని జ్ఞప్తికి వస్తుండాలి. అవతలి వ్యక్తి ప్రవర్తన వల్లనే తప్పు జరుగుతుందని తెలిస్తే సాధ్యమైనంతవరకూ వారికి దూరంగా ఉండటమే మంచిది.