61 ఏళ్ల వయస్సులో మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫిట్ నెస్ తో నేటి యువతకే సవాల్ విసుతున్నారు దినేష్ మోహన్. మోడలింగ్ అంటే అందమైన ఆకృతితో యువతే ఉంటారనే మాటకు చెల్లుచీటీ ఇచ్చేశారు దినేష్ మోహన్. దినేష్ మోహన్ సీనియర్ ఏజ్ ఫ్యాషన్ మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. 61 ఏళ్ల వయస్సులో యువ మోడళ్లకు మంచి పోటీ ఇస్తున్న దినేష్ మోహన్ ఫిట్ నెస్ యూసి మోడలింగ్ యువత నోరెళ్లబెడుతున్నారు.
దినేష్ తన 61 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించడం విశేషం. గుర్గావ్కు చెందిన దినేష్ మోడలింగ్ ప్రయాణం అత్యంత విచిత్రంగా సాగింది. 44 ఏళ్ల వయసు వరకూ దినేష్ స్థూలకాయంతో కూర్చోవటానికి…నిలబడటానికి కూడా నానా అవస్థలు పడేవారు. దానికి తగినట్లుగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు.
అలా సంవత్సరం పాటు మంచానికే పరిమితం అయిపోయారు దినేష్ మోహన్. జీవితంలో ఎదురైనా కష్టాలను చూసి దినేష్ డిప్రషన్‌లోకి కూడా వెళ్లిపోయారు. దీంతో చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి 2004లో తన సోదరి ఇంటికి వెళ్లిపోయారు.అక్కడకు వెళ్లాక మరింతగా ఆరోగ్యం విషమించింది. భారీ కాయంతో..పెరిగిన జుట్టుతో జిడ్డు కారుతున్న శరీరంతో ఉన్న దినేష్ ను చూసి అందరూ వింతగా చూసేవారు. హేళన చేసేవారు.
అనారోగ్యంతో ఉన్నా సరే ఆకలిమాత్రం తగ్గలేదు. విపరీతంగా తినేవారు.దీంతో శరీరం ఎలా పడితే అలా పెరిగిపోయింది. తిండి తగ్గించాలని చాలా గట్టిగా అనుకునేవారు. కానీ సాధ్యమయ్యేది కాదు. ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలాగైనా బయటపడాలని నిశ్చయించుకుని 2014లో జిమ్‌లో చేరారు. గేప్ ఇవ్వకుండా క్రమశిక్షణతో భారీ కసరత్తులు చేసేవారు. తినే ఆహారం విశ్రాంతి విషయంలో చాలా మార్పులు చేసుకున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి నుంచి పూర్తి శాకాహారిగా మారిపోయి పండ్లు, కూరగాయలు మాత్రమే తినడం ప్రారంభించారు. అలా కేవలం 8 నెలల వ్యవధిలో ఫిట్‌గా మారిపోయారు దినేష్ మోహన్.
దినేష్ ఫిట్నెస్ చూసిన ఫిజియోథెరపిస్ట్ అతనిని మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని ప్రోత్సహించారు. దానికి సంబంధించిన మెళకువలను కూడా సూచించారు. అలా దినేష్ 2016లో దినేష్ తన తొలి మోడలింగ్ అసైన్మెంట్ పూర్తి చేశారు. దీంతో దినేష్ తిరిగి చూసుకోలేదు. అటువంటి అవసరం కూడా లేకపోయింది. 61 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన దినేష్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సినిమా ‘భారత్’లో నటించారు. భారీ కాయంతో ఫుల్ మాస్ గా ఉండే దినేష్ మోహన్ మోడల్ గా ఎదిగారు 61 సంవత్సరాల వయస్సులో దినేష్ మోహన్. సల్మాన్ ఖాన్ వంటి సినీ అనుభవజ్ఞులలో అతను రెండు ప్రధాన బాలీవుడ్ సినిమాల్లో నటించారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ..ఒకప్పుడు భారీ కాయంతోమంచానికే పరిమితమైపోయిన నేను ఇలా తయారు కావటం చాలా సంతోషంగా ఉందన్నారు.నేను స్ఫూర్తిదాయకంగా ఉన్నానని చాలామంది అంటున్నారు..కానీ వయస్సు ఒక నంబర్ మాత్రమేనని నేను నమ్ముతున్నానని అన్నారు. నేను మోడల్ అయినా నా జుట్టుకుమాత్రం రంగు వేయనని నవ్వుతూ చెప్పేశారు మోహన్. నాజుట్టు నా సంకల్పాన్ని ఎప్పటికీ గుర్తు చేస్తుంటుందని అన్నారు. మోడల్ అయ్యాక క్యాట్ వాక్ చేసినప్పుడు ఎంతో సిగ్గుగా అనిపించిందనీ..చాలా భావోద్వేగం అనిపించిందని కానీ తరువాత సహజసిద్దంగా నడక అలవాటు అయిపోయిందని తెలిపారు దినేష్ మోహన్.