బిగ్‌బాస్ 3‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి

  • Publish Date - September 24, 2019 / 09:10 AM IST

బిగ్ బాస్ హౌస్‌లో ఆదివారం హిమజ ఎలిమినేట్ కావడంతో… ఇంకా 9 మంది సభ్యులు మిగిలారు. ఇక ఈ తొమ్మిది మంది మధ్య సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం 10వ వారం నామినేషన్స్‌లో దాదాపు అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటం గమనార్హం. శ్రీముఖి, రవి, వరుణ్, బాబా భాస్కర్‌ లు నామినేట్ అయ్యారు. వీరందరికి బయట ఫాలోయింగ్ విపరీతంగా ఉందని చెప్పవచ్చు. అందువల్ల ఈ వారం ఎలిమినేషన్ ఓటింగ్ టఫ్‌ గా జరిగే అవకాశం ఉంది. 

అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్‌ జోన్‌లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. ఇక నామినేషన్‌ ప్రక్రియ పూర్తయి ఒక్కరోజైనా గడిచిందో లేదో అప్పుడే రవి ఎలిమినేట్‌ అవుతాడంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయ్. 

ఇక నిన్న ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌..  ఇవాళ్ల వారికి ఫన్నీ టాస్క్‌ ఇచ్చి కూల్‌ చేయనున్నాడు. ఈ టాస్క్ లో తరిగిపోనంత ఆస్తులున్నా పిల్లికి బిచ్చం వేయని మహా పిసినారిగా శివజ్యోతి కనిపించనుంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉంటారు. శివజ్యోతి మేనేజర్‌ గా బాబా భాస్కర్‌. ఇక ఈ ఎపిసోడ్‌ జనాలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంటిసభ్యులు ఈ రోజు ఎంత రచ్చ చేయనున్నారో చూడాలి.