మణికర్నిక ఝాన్సీ రాణి: కంగనా ఇంటి వద్ద భద్రత

  • Publish Date - January 24, 2019 / 03:52 AM IST

మణికర్ణిక మూవీ విడుదలకు రెండు రోజుల ముందు, ప్రముఖ నటి కంగనా రనౌత్  నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయిను అగౌరవపరిచేలా సన్నివేశాలున్నాయంటూ హిందూ కర్ణిసేన ఆందోళనలకు దిగారు. 

ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు కారణంగా రాజపుత్రుల మనోభావాలు గాయపడ్డాయని కర్ని సేన అభిప్రాయపడ్డారు. “ఒక బ్రిటీష్ అధికారితో రాణి లక్ష్మీబాయికి సంబంధం ఉందనే రీతిలో ఈ సినిమాలో సన్నివేశాలు ఉండటం పట్ల కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం​చేస్తోంది.  

సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను కించపరిచేలా ఏ ఒక్క సీన్‌ ఉన్నా హిందూ సమాజం కంగనాను క్షమించబోదని, ఆమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందిని కర్ణిసేన హెచరించింది. మహారాష్ట్రలో తన సభ్యులను స్వేచ్ఛగా నడిపించని, తన చలన చిత్రాలను బర్న్ చేస్తామని మహారాష్ట్ర కర్ణీ సేన అధ్యక్షుడు అజయ్ సింగ్ సెంగార్ అన్నారు.  ఈ సినిమా జనవరి 25, 2019 న తెరపైకి రానుంది.