Nayan Sarika Chandni Choudhary Pradeep celebrating their birthday along with prabhas
Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. మామూలు హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన డార్లింగ్ ఇప్పుడు నెంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగాడు. అంతేకాదు అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో కూడా మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు.
అయితే నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా బర్త్ డే జరుపుకుంటున్నారు. వారు ఎవరంటే..
Also Read : Ram Charan : రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ కారుకి ఫ్యాన్సీ నెంబర్.. ఏంటో తెలుసా..
బుల్లితెర స్టార్ ప్రదీప్..
బుల్లితెరపై మొదట యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ హీరోలకి పోటీగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఈయన హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ఎనౌన్స్ చేసాడు ప్రదీప్. తాజాగా తన పుట్టిన రోజు కానుకగా ఈ మూవీ నుండి పోస్టర్ రిలీజ్ చెయ్యగా వైరల్ అవుతుంది.
చాందిని చౌదరి..
తెలుగమ్మాయిగా సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన ఈ భామ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె “సంతాన ప్రాప్తిరస్తు” అనే సినిమా చేస్తుంది. ఇక నేడు తన బర్త్ డే సందర్బంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. అందులో తనకి ఎలాంటి భర్త కావాలి అన్న సమాచారం ఉంది.
నయన్ సారిక..
చాల చిన్న సినిమాగా వచ్చిన ‘ఆయ్’ లో హీరోయిన్ గా నటించి బాగా పాపులర్ అయ్యింది నయన్ సారిక. ఈ సినిమా తరువాత కిరణ్ సబ్బవరం హీరోగా నటిస్తున్న ‘క’ లో హీరోయిన్ గా చేస్తుంది. అయితే తాజాగా తన బర్త్ డే సందర్బంగా ‘క’ సినిమా నుండి తన స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.