Ram Gopal Varma : అల్లు అర్జున్ అసలైన మెగాస్టార్.. వర్మ ట్వీట్ వైరల్..

మెగా ఫ్యామిలీకి సంబంధించి, మెగా హీరోల గురించి ట్వీట్స్ వెయ్యడానికి ఎందుకో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆయన ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్.. తర్వాత కాంట్రవర్సీ కింగ్‌గా మారాడు.. తన క్రియేటివిటీని పక్కన పెట్టి సోషల్ మీడియా మీద ఫోకస్ చేశాడు. పొద్దున్న లేచింది మొదలు ప్రపంచంలో, సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆయనకే కావాలి. ఏ విషయం తన దృష్టికి వచ్చినా ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటాడు.

Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..

పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఎప్పుడూ మెగా ఫ్యామిలీకి సంబంధించి, మెగా హీరోల గురించి ట్వీట్స్ వెయ్యడానికి ఎందుకో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల గురించి ట్వీట్స్ చేస్తే ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఫైర్ అయ్యారో తెలిసిందే.

Mega 154 : మెగా ఫ్యాన్స్.. పూనకాలు లోడింగ్..

రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా మరోసారి మెగా ఫ్యామిలీ గురించి ట్వీట్స్ వేశాడు. మొన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సందడి చేశారు. అయితే ఆ వేడుకల్లో అల్లు అర్జున్ లేడని ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే.. వర్మ వారిని మరింత రెచ్చగొట్టేలా ట్వీట్ చేశాడు.

మెగాస్టార్ బర్త్‌డే ఈవెంట్‌కి వచ్చినవారంతా చిరు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ అల్లు అర్జున్ ఒక్కడే అసలైన మెగాస్టార్ అంటూ కామెంట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్‌పై మెగా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గతంలో అల్లు ఫ్యామిలీ గురించి కామెంట్స్ చేసిన వర్మ ఇప్పుడు బన్నీకి సపోర్ట్‌గా ట్వీట్ చెయ్యడం సెన్సేషనల్ న్యూస్ అయ్యింది.