Star Hero Ram Charan New Rolls Royce Car
Ram Charan : గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. రోల్స్ రాయిస్ లేటెస్ట్ వెర్షన్ స్పెక్ట్రా కారు కొనుగోలు చేసిన తర్వాత కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీసీ కార్యాలయానికి వచ్చారు. అయితే దాదాపు 7.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఈ కారుకి TG 09 2727 ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది. ఇక ఇప్పటికే చరణ్ దగ్గర ఫ్యాన్సీ నంబర్స్ తో చాలా కార్లే ఉన్నాయ్. అలా ఇప్పుడు చెర్రీ కార్ గ్యారేజ్ లో ఈ కార్ కూడా చేరింది.
Also Read : Chandini Chowdary : అలాంటి భర్త కావాలంటున్న హీరోయిన్.. బర్త్ డే రోజు స్పెషల్ పోస్టర్ ..
ఇక ఈ కార్ రిజిస్ట్రేషన్ కోసం చరణ్ వెళ్ళినప్పుడు ఫాన్స్ తో ఆ ప్రదేశం కిక్కిరిసిపోయింది. రెజిస్ట్రేషన్ అనంతరం అక్కడున్న అధికారులందరూ ఆయనతో ఫోటోలు దిగారు. ఇకపోతే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దగ్గర కూడా రోల్స్ రాయిస్ కారు ఉంది. అలాగే పలువురు సెలబ్రెటీస్ దగ్గర కూడా ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ కారుకి సంబందించిన ఈ ఫ్యాన్సీ నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.