Bharat Jodo Yatra: తమిళనాడు ముగించుకుని కేరళలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని, సమాజంలోని రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, విభజన రాజకీయాలకు తెరపడాలని యవద్భారత ప్రజలు చాలా స్పష్టంగా సందేశం ఇస్తున్నారు'' అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రియాంక అన్నారు

Bharat Jodo Yatra: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడు రాష్ట్రంలో ముగిసి ఆదివారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. పర్యటన ప్రారంభమైన నాటి నుంచి ఐదు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలో కొనసాగిన ఈ యాత్ర.. ఆరవ రోజు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కేరళ రాష్ట్రంలో 19 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. కేరళలో రాహుల్‭కు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఘన స్వాగతం లభించింది.

కేరళ, తమిళనాడు సరిహద్దుల సమీపంలో ఉన్న తిరువనంతపురంలోని పరస్సాల నుంచి ఉదయం 7.30 గంటలకు యాత్ర మొదలైంది. సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రాహుల్‌కు సాదర స్వాగతం పలికారు. రాహుల్ ఆదివారం యాత్రలో భాగంగా నెయ్యటింకర, బలరామపురం ప్రాంతంలోని సంప్రదాయ చేనేత కార్మికులను కలుసుకున్నారు. మూడు గంటల సేపు యాత్ర సాగింది. తిరిగి సాయంత్రం యాత్ర ముందుకు సాగనుంది. యాత్ర ఫోటోలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాక గాంధీ వాద్రా షేర్ చేశారు.

భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని, సమాజంలోని రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా అన్ని వర్గాల వారూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ”ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, విభజన రాజకీయాలకు తెరపడాలని యవద్భారత ప్రజలు చాలా స్పష్టంగా సందేశం ఇస్తున్నారు” అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రియాంక అన్నారు. ”చేతులు కలపుతూ, హృదయాలను ఏకం చేస్తూ భారత్ జోడో యాత్ర ఇండియాను ఐక్యం చేయనుంది” అని ఆమె ట్వీట్ చేశారు.

Jammu and Kashmir: ఆర్టికల్ 370పై సంచలన ప్రకటన చేసిన గులాం నబీ ఆజాద్

ట్రెండింగ్ వార్తలు