కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్‌ను ఈసీ ఆదేశించింది.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్‌ను ఈసీ ఆదేశించింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు శాంతిసామరస్యతకు భంగం కలిగేలా ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని ఈసీ అభిప్రాయపడింది. రేపు మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే నివేదిక సమర్పించారని ఈసీ తెలిపింది. నివేదిక ప్రకారం ఇటీవల ఢిల్లీ రితాలా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే క్రమంలో ‘దేశద్రోహులు’ అనే నినాదాన్ని పలుసార్లు వాడినట్లు తెలిసిందన్నారు. అలాగే ‘వారిపై తూటాలు పేల్చండి’ అనే వ్యాఖ్యల్ని కూడా నినదించినట్లు నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ … సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు. దేశ్ కే గద్దారోం కో అని అనురాగ్ నినదిస్తే గోలీ మారో సాలోం కో… అని సభికులు ప్రతి నినాదం ఇచ్చారు. అయితే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం…. అనురాగ్ ఠాకూర్‌కు నోటీసులు పంపించింది. జనవరి 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది హెచ్చరించింది.