18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.

  • Publish Date - November 16, 2019 / 04:02 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ మహిళా కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారు. 18 మంది మహిళా కార్మికులు ఆర్టీసీ డిపోలోని సీఐటీయూ కార్యాలయంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. పెట్రోల్ బాటిల్స్, గ్యాస్ సిలిండర్ తో పేల్చుకుంటామని బెదిరించారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే బయటికి వస్తామని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. 

అక్కడి చేరుకున్న పోలీసులు యూనియన్ నాయకులు, మహిళలతో మాట్లాడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవద్దని..వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు తలుపులు కొట్టినా మహిళలు బయటికి రావడం లేదు. సీఐటీయూ అనుబంధంగా ఉన్న ఎస్ డబ్ల్యుఎఫ్ కార్యాలయంలోకి వెళ్లిన మహిళలు మాత్రం తమకు ఇదే ఆఖరి సమ్మె కావాలని, చివరి రోజు కావాలని సీరియస్ చెబుతున్నారు. 

ప్రభుత్వం చర్చలకు పిలిచి, సమస్యలను పరిష్కరించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ చొరవ తీసుకుని సమప్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. బలవంతంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే ఆత్మహత్యకు చేసుకుంటామని, తమ పిల్లలను కడపారి చూసుకోకుండా అవుతామని భీష్మించుకొని కూర్చున్నారు.  

మేము తెలంగాణ ఆడ బిడ్డలం..రాజకీయపార్టీలతో మాకు అవసరం లేదు. ఏవరైనా సరే కేసీఆర్ తో మాట్లాడి చర్చలు జరిపించాలి. ప్రభుత్వం చర్చలకు పిలవాలని మహిళలు పట్టుబట్టారు. భారీ బందోబస్తు నడుమ మహిళలను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.