సెలక్ట్ కమిటీ ఏర్పాటు లేనే లేదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సెలక్ట్ కమిటీ జాబితా అంటూ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తోందని చెప్పారు.
సెలక్ట్ కమిటీ ఏర్పాటు లేనే లేదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సెలక్ట్ కమిటీ జాబితా అంటూ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తోందని చెప్పారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కమిటీ ఛైర్మన్ గా బాధ్యత స్వీకరించే పరిస్థితే లేదన్నారు. రాజుల కాలంలో ఇచ్చినట్లు ఫత్వా ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.
ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీలను చైర్మన్ షరీఫ్ ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణను మండలి చైర్మన్ నియమించారు. సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా, వైసీపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజు ఇతర సభ్యులు.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి ఉండగా.. పీడీఎఫ్‌కి చెందిన లక్ష్మణరావు, బీజేపీకి చెందిన మాధవ్, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఇదిలా ఉంటే సెలక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ మండలి చైర్మన్‌కు వైసీపీ లేఖ రాసింది.
కమిటీల్లో తామూ భాగస్వాములము కాబోమని లేఖలో పేర్కొంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు మండలి చైర్మన్‌కు లేఖ రాశారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు గడువు బుధవారం ముగిసింది. ఇప్పటికే ఆయా పార్టీలు సభ్యుల పేర్లను సూచిస్తూ.. లేఖలు ఇవ్వడంతో చైర్మన్ కమిటీలు ఏర్పాటు చేశారు. తన విచక్షణాధికారాలను ఎవరూ ప్రశ్నించలేరని ఈ సందర్భంగా చైర్మన్ షరీఫ్ వ్యాఖ్యానించారు.