అయ్య బాబోయ్..ఎలుగు బంట్లు అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హడలిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన బత్తిని కామేశు అనే వ్యక్తిపై ఎలుగు బంట్లు దాడికి పాల్పడ్డాయి. అతన్ని పలాసకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
సమీపంలోని అడవుల నుంచి మొక్క జీడి తోటలల్లోకి వస్తున్న ఎలుగు బంట్ల రాత్రి సమయంలో బైటకు వచ్చి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఇది ఏ ఒక్కరోజో కాదు ఎంతో కాలం నుంచి జరుగుతోంది. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం, సోంపేట, ఎర్రముక్కాం ప్రాంతాల్లో ప్రజలు ఒంటరిగా బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
అడవుల్లోంచి వచ్చిన ఎలుగు బంట్లు ఉదయం సమయాల్లో జీడితోటలు..డొంకల్లో ఉంటూ రాత్రి సమయంలో బైటకొస్తున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతున్నాయి. కనిపించిన ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఇదే భయంతో శ్రీకాకుళం జిల్లాలో భయాన్ని కలిగిస్తున్నాయి.