ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజు మారితే రాజధాని మారదు అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ.30వేల కోట్ల పనులు
ఏపీ రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజు మారితే రాజధాని మారదు అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ.30వేల కోట్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఈ సమయంలో రాజధాని మార్పు నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ రాజధానిని అమరావతి నుంచి షిప్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు.
జగన్ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. సీఎం జగన్ విధానాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడంపైనే సీఎం జగన్ దృష్టి ఉందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆగడం వల్ల రైతులకు పంట నష్టం కలిగిందన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబపాలన పెరగడం వల్లే తాను బీజేపీలో చేరానని సుజనా వివరించారు.