నెల్లూరు జిల్లాలో బాంబు పేలుడు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నివాసప్రాంతంలో బాంబు ప్రమాదం చోటు చేసుకుంది. వీధి కుక్క నోటితో కొరకడంతో బాంబు పేలినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదు. కాకపోతే బాంబు ప్రమాదానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

వెంటనే సమాచారం పోలీసులకు అందించడంతో ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలను బట్టి అది లోకల్‌గా తయారుచేసే బాంబుగా గుర్తించారు. నివాసప్రాంతాల్లోకి వచ్చి నష్టం చేస్తున్న అడవి పందులను తరిమికొట్టేందుకు అలాంటి బాంబులను స్థానికంగా తయారుచేస్తుంటారని పేర్కొన్నారు.