విశాఖ సముద్ర తీరంలో చైనా షిప్ కలకలం!!

  • Publish Date - March 6, 2020 / 05:36 AM IST

విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. కరోనా కరాళ నృత్యం చేసిన చైనా దేశం నుంచి ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ షిప్ రావటంతో అధికారులు కలవరం చెందారు. చైనాకు చెందిన ‘ఫార్చూన్‌ హీరో’ షిప్‌ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్‌కి రావడానికి పారాదీప్ పోర్టు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ షిప్‌లో చైనా, బర్మాలకు చెందిన 22 మంది నావికులు ఉన్నారు. 

వీరంతా చైనా నుంచి వచ్చారు కావట్టి వారికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానంతో ఒడ్డుకు రావొద్దని అధికారులు ఆంక్షలు విధించారు. నావికుల ఆరోగ్యపరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరందరికీ వైద్యపరీక్షలు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ముందు జాగ్రత్తగా ఈ షిప్‌ను వెనక్కు తిప్పి పంపాలనే పోర్ట్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. (కరో కరో జర జల్సా : కరోనా వార్డుల్లో వైద్యుల డ్యాన్స్..ఎందుకో తెలుసా..?)

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి 3386 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరోనా పేరెత్తితేనే ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోని ఏపీ, తెలంగాణల్లో బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది ఏకంగా చైనా నుంచి వచ్చిన షిప్ అంటే సహజంగానే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపైనా స్పష్టత లేకపోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు.