ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలు పెంచుతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలు కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 500ల యూనిట్లు పెబడితే.. ప్రతీ యూనిట్ కి రూ.9.05 నుంచి రూ.9.95 కి పెరుగుతాయి.
ఈ ప్రభావం ఏపీలోని 1.35 లక్షలకు పైగా గృహాల వినియోగదారులకు పెను భారంగా మారనుంది. ముఖ్యంగా ప్రభుత్వ,కార్పొరేట్ సంస్థలపై ఛార్జీలు భారం పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలు రూ.1300 కోట్లు భారం పడుతుంది.
కాగా..గత కొంత కాలంగా ఏపీలో విద్యుత్ చార్జీలను పెంచుతారు అనే ప్రచారం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ ప్రభావం చిన్న మధ్యతరహా పరిశ్రమలపై భారీగా పడుతుంది. ఇప్పటికే ఏపీలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
విద్యుత్ కోతలతో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడిన చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడే ఆ నష్టాల నుంచి బైటపడుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై మరోసారి పెను భారంగా మారనుంది. కాగా..రాష్ట్ర ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.