అమరావతిలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్ : సీఎం జగన్

  • Publish Date - December 27, 2019 / 09:54 AM IST

ఏపీ రాజధాని అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అది వృధాయే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయటంలేమనీ..అదే విశాఖపట్నంలో రాజధాని అయితే అమరావతిలో పెట్టిన ఖర్చులో కేవలం 10శాతం ఖర్చు చేస్తే హైదరాబాద్ ను తలదన్నే రాజధాని అవుతుందని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

శుక్రవారం (డిసెంబర్ 27)న సీఎం జగన్ ఆధ్వర్యంలో కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ అరగంటపాటు మంత్రులకు వివరించారు. మూడు రాజధానులు అని తాను అసెంబ్లీలో ప్రతిపాదించినా..జీఎన్ రావు కమిటీ దానికి సంబంధించి నివేదిక ఇచ్చిందనీ..కానీ ఇప్పటికిప్పుడే రాజధాని తరలిపోదనీ దానికి తొందరపాటు అవసరం లేదని మంత్రులతో అన్నారు.  

కాగా..రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాజధాని తరలింపుపై ఏర్పాటు కానున్న హైపవర్ కమిటీ మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూడు రాజధానుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం హయాంలో  రాజధాని అమరావతికి భూములు సేకరణలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేబినెట్ చర్చింది.