రోడ్డు ప్రమాదాలకు ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో కూడా తెలియని పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకలు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
నల్లజర్లలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. విశాఖపట్నానికి చెందిన 11మంది కుటుంబ సభ్యులు వ్యానులో ఏలూరుకు వెళ్తుండగా..ఎదురుగా వస్తున్న లారీ వ్యానును వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులు సహాయంతో గాయపడినవారిని హాస్పిటల్ కు తరలిస్తుండగా..ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
మృతుల్లో ఓ పురుషుడు,మహిళ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. వ్యాను డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.