ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 10వ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 8 వికెట్లు నష్టపోయి 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో దినేశ్ కార్తీక్(50; 36 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సులు), ఆండ్రీ రస్సెల్(62; 28బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సులు)తో జట్టుకు హైలెట్ స్కోరు చేయగలిగారు.
మిగిలిన ప్లేయర్లు నిఖిల్ నాయక్(7), క్రిస్ లిన్(20), రాబిన్ ఊతప్ప(11), నితీశ్ రానా(1), శుభమాన్ గిల్(4), పీయూశ్ చావ్లా(11), కుల్దీప్ యాదవ్(10)పరుగులు చేయగలిగారు.