గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే ఆ
గ్రామ సచివాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై బీజేపీ నేత సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే ఆ రంగులను మార్చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సీఎం జగన్ ఏం సందేశం ఇస్తున్నారు అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని వేమూరులో గాంధీ సంకల్ప యాత్రను బీజేపీ నేత సోము వీర్రాజు ప్రారంభించారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని ఖండించారు.
చేనేత నేస్తం పథకంపైనా వీర్రాజు విమర్శలు చేశారు. చేనేతకు డబ్బులు ఇవ్వడం కాదని వారి బతుకులు మార్చడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చేనేతకు గతంలో ఇవ్వాల్సిన రూ.120 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ, చంద్రబాబుపైనా సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సొమ్ము పప్పు బెల్లంలా పంచిపెట్టడంతో టీడీపీకి 23 సీట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే పని చేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మెడలు వంచుతామని చంద్రబాబు అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. గల్లా జయదేవ్, బాలకృష్ణతో విమర్శలు చేయించింది నిజం కాదా? అని నిలదీశారు. రాజధాని శంకుస్థాపనకు పవిత్ర జలాలు తెస్తే కించపర్చింది నిజం కాదా? అని అడిగారు. పొత్తులో ఉండగానే మోడీ దిష్టి బొమ్మలు దగ్గం చేయించలేదా? అని మండిపడ్డారు. బీజేపీ బలపడుతోందని దాంతో చంద్రబాబులో భయం పెరిగిందని ఆయన అన్నారు. మరోసారి బీజేపీతో జత కట్టడానికి చంద్రబాబు దారులు వెతుక్కుంటున్నారని సోమువీర్రాజు అన్నారు.