బెంగళూరు మరో సారి ఓటమి బాట పట్టింది. ఐపీఎల్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగిన సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వీర బాదుడుకు బెంగళూరు బెదిరిపోయింది. ఈ క్రమంలో ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే 118 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్ని విభాగాల్లో ఫెయిలైంది.
20 ఓవర్లకు 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 231 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు ముందు బెంగళూరు చేతులెత్తేసింది. జట్టులో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయలేకపోయారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పార్థివ్ పటేల్ మినహాయించి శివం దూబె వరకూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్రాండ్ హోమ్.. ప్రయాస్ బర్మాన్ వికెట్ల పతనాన్ని కాసేపటి వరకూ ఆపగలిగి జట్టు పరువు కాపాడారు.
పార్థివ్ పటేల్(11), షిమ్రోన్ హెట్‌మేయర్(9), విరాట్ కోహ్లీ(3), డివిలియర్స్(1), మొయిన్ అలీ(2), శివం దూబె(5), గ్రాండ్ హోమ్(37), ప్రయాస్ బర్మాన్(19), చాహల్(0), ఉమేశ్ యాదవ్(14), సిరాజ్(2) లు అత్యల్ప స్కోరుకే పరిమితమై వెనుదిరిగారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ సొంతగడ్డపై చెలరేగి ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 232 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఉప్పల్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో ఓపెనర్లు దూకుడైన ఆటతీరు ప్రదర్శించారు.
ఈ క్రమంలో జానీ బెయిర్ స్టో(114; 56బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులు), డేవిడ్ వార్నర్( 100; 55 బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్సులు) పరాక్రమం మ్యాచ్ ఆసాంతం కొనసాగింది. 16.2 ఓవర్ల వద్ద ఓపెనర్ బెయిర్ స్టో జట్టు స్కోరు 185 పరుగుల వద్ద వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్(6), విజయ్ శంకర్(9) సహకరించకపోవడంతో స్కోరు బోర్డు కాస్త నిదానంగా నడిచింది.