ట్రెండింగ్.. సంతూర్ మామ్స్ ఫోటోలు వైరల్

  • Publish Date - February 18, 2020 / 05:26 AM IST

సంతూర్ మామ్స్.. ప్రస్తుతం ట్విట్టర్ లో ఓ రేంజ్లో ట్రెండ్డింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. బ్యూటిఫుల్ మామ్స్ అంతా తమ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. నేను సంతూర్ మమ్మీనే అంటూ ఒకొక్కరు ఒక్కో క్యాప్షన్  పెడుతున్నారు.

కొంతమంది నేనూ నా పదహారేళ్ల కూతురు అంటూ కామెంట్లు పెడితే.. మరికొంతమంది మీ విత్ మై డాటర్, సన్ అనే క్యాప్షన్లతో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా మామ్స్ అంతా ట్విట్టర్ లో ఫుల్ జోష్ గా ఉన్నారు. బ్యూటిఫుల్ మధర్ ఫోటోస్ తో కొన్ని వేల ట్విట్స్ వచ్చి పడ్డాయి.

ఈ హ్యష్ ట్యాగ్ చూసిన ట్వట్టర్ యూజర్లంతా కామెంట్లతో అదరగొట్టేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో సంతూర్ మామ్స్ అనే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు సెలబ్రెటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.