Amazon Ac
Amazon: అమెజాన్.. పెద్ద ఈ కామర్స్ వెబ్‌సైట్ సోమవారం పెద్ద పొరబాటు చేసింది. రూ.96వేల 700విలువ చేసే తోషిబా ఎయిర్ కండిషనర్(ఏసీ) 94శాతం డిస్కౌంట్ తో రూ.5వేల 900కే దొరుకుతుందంటూ సోమవారం లిస్ట్ చేసింది. రూ.90వేల 800 భారీ తగ్గింపు ఇవ్వడమే కాకుండా నెలవారీ వాయిదాల ఫెసిలిటీ కూడా కల్పించింది. రూ.278 ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఇచ్చింది.
ఈ ఆఫర్ దక్కించుకునేందుకు చాలా మంది త్వరపడ్డారు. ప్రస్తుతం దాని 5స్టార్ 1.8టన్ తోషిబా ఏసీ ఇన్వెర్టర్ 20శాతం డిస్కౌంట్ తో రూ.59వేల 490కి దొరుకుతుందని అమెజాన్ రేట్ ఫిక్స్ చేసింది. దీని ప్రత్యేక ఫీచర్లు అయిన యాంటీబ్యాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైర్ లాంటివి ఉన్నాయి. సంవత్సరం వారెంటీతో పాటు కంప్రెస్సర్, పీసీబీ, సెన్సార్, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్‌పై 9సంవత్సరాల వారంటీ అందిస్తుంది.
ఈ తోషిబా ఏసీకు.. మ్యాజిక్ కాయిల్ ఎక్కువ కాలం మన్నడంతో పాటు, శక్తి వినియోగం కూడా తక్కువ ఉంటుంది. 100శాతం, 75శాతం, 50శాతంలకు కూడా పవర్ కన్జమ్షన్ మార్చుకోవచ్చు.
అమెజాన్ ఇలా చేయడం ఫస్ట్ టైం కాదు. ప్రైమ్ డే 2019 సమయంలో ఈ.. ఈ కామర్స్ దిగ్గజం రూ.9లక్షల కెమెరాను రూ.6వేల 500కే అందించింది. కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేయడంతో అలర్ట్ అయిన అమెజాన్ ధరను మాడిఫై చేసింది.