నీకు దండం తల్లి : 15 ఏళ్లుగా బేబీ పౌడరే ఆహారం

  • Publish Date - January 8, 2020 / 02:54 AM IST

సాధారణంగా ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వింత అలవాటు ఉంటుంది. కొందరు మట్టి, బియ్యం చూస్తే తినకుండా ఉండలేరు, మరికొందరు చాక్ పీసులు, బలపాలు చూస్తే వదిలిపెట్టరు. అయితే ఇలాగే ఓ మహిళ కూడా ఆకలేస్తే అన్నం తినదు. చిన్నపిల్లల ముఖానికి రాసే బేబి పౌడరును గిన్నెలో వేసుకుని తినేస్తుంది. ఒకటి, రెండు రోజులు కాదండోయ్.. గత 15 ఏళ్లుగా ఈమెకు అదే అలవాటు.

లిసా అండర్సన్ అనే 44 ఏళ్ల మహిళ 2004లో తన పిల్లలకు జాన్సన్ పౌడర్ రాస్తూ.. వాసనకు అలవాటు పడింది. ఆ తర్వాత దాని రుచి తెలుసుకుందామని తినింది. అంతే దాని రుచి నచ్చడంతో రోజువారీ ఆహారంగా దాన్ని తినేస్తుంది. లంచ్ తిన్నా, తినకపోయినా మూడు పూటలా పౌడర్ తింటుంది. 

Read Also..షాకింగ్ : పాప్‌కార్న్ తిన్నందుకు గుండెకు సర్జరీ

దీంతో ఆమెకు కేవలం జాన్సన్ పౌడర్ ఖర్చే అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పటివరకు ఆమె పౌడర్ డబ్బాల కోసం రూ.7.5 లక్షలు ఖర్చుపెట్టింది. ఆమెకు ఐదుగురు పిల్లలు పుట్టినా ఆ అలవాటు మాత్రం మానలేదు. రోజుకు కనీసం 200 గ్రాముల ఫౌడర్ డబ్బాను ఖాళీ చేస్తుందట. ఒక పెద్ద డబ్బాలో పౌడరును కనీసం పది రోజులు తింటుందట. ఈ విషయం ఆమె భర్తకు కూడా తెలియదట.

అయితే ఈ అలవాటు తగ్గకపోవడంతో ఆమె వైద్య నిపుణులను కలిసింది. అప్పుడు వైద్యులు ఆమెకు PICA సిండ్రోమ్ అనే వ్యాధి ఉందని తెలిపారు. ఇదో ఈటింగ్ డిజార్డర్ అని, దీనివల్ల తినడానికి ఉపయోగపడని పదార్థాలను రుచి చూడాలనే ఆలోచన వస్తుందని చెప్పారు. దీనివల్ల రక్తంలో ఐరన్ లోపం తలెత్తే ప్రమాదం కూడా ఉందన్నారు వైద్యులు.