Watermelon : పుచ్చసాగులో తెగుళ్ళు,చీడపీడల నివారణ!

పండు ఈగ యొక్క లార్వాలు కాయలలోకి చొచ్చుకుపోయి కాయలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు ముందస్తుగా పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి.

Watermelon : పుచ్చసాగులో తెగుళ్ళు,చీడపీడల నివారణ!

Watermelon Insect Control

Watermelon : పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. అన్ని కాలాలకు అనువైన రకాలు రావడంతో రైతులు అన్ని కాలాలో సాగుచేస్తున్నారు. నీరు ఇంకే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, సారవంతమైన ఇసుక నేలలు, ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. పొడి వాతావరణంలో అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు పూర్తి విస్తీర్ణన్ని ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా కొన్ని రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి. విత్తనం వేసే ముందు భూమిని 2-3 సార్లు దమ్ము చేసుకొని నేలమొత్తం వదులుగా అయ్యేల దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25-30 కిలోల యూరియ, మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని చివరి దమ్ము చేసుకొని భూమిని విత్తనానికి సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల మార్కెటింగ్ కి అనువుగా ఉంటుంది. ధరలను అంచవేయ్యలేము కావున ధరల వ్యత్యాసాలు మొత్తానికి సగటు ధర లభిస్తుంది.

తెగుళ్ళు మరియు చీడపిడలు ;

ఎర్ర నల్లి ; పొడి వాతావరణ పరిస్థితులలో ఈ ఎర్రనల్లి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీనిని గుర్తుంచడం చాల కష్టం. ఈ పురుగు ఆకు యొక్క అడుగు బాగామునకు చేరి రసాన్ని పిలుస్తూ పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణ చర్యకు 1 లీటర్ నీటికి 1.5 ఎంఎల్ స్పెరోమేసిఫిన్ లేదా 3 ఎంఎల్ ప్రోపర్ గైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.

తెల్ల దోమ ; జిగురు కలిగిన పసుపు రంగు అట్టలను చేనులో ఏర్పాటు చేసుకోవలెను. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటె నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 గ్రాముల ఎసిటామిప్రిడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను. తామర పురుగు తామర పురుగు ఆకులు ముడతలుగా, పసుపు రంగుకు మారి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 ఎంఎల్ ఫిప్రోనిల్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

కాయ తొలుచు పురుగు ; పండు ఈగ యొక్క లార్వాలు కాయలలోకి చొచ్చుకుపోయి కాయలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు ముందస్తుగా పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. క్యూలూర్ అందుబాటులో లేని సమయములో 10 లీటర్ల నీటిలో 100 ఎంఎల్ మలాథియాన్ మరియు 100 గ్రాముల బెల్లం కలుపుకొని వెడల్పాటి పళ్ళెంలో ఈ ద్రవాన్ని పోసి పంట చేనులో అక్కడ, అక్కడ ఎరలుగా ఉంచాలి. దీనివల్ల ఈ పండు ఈగ కాయలను ఆశించక ముందే నివారించవచ్చు. పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 ఎంఎల్ మలాథియాన్ లేదా 2 ఎంఎల్ క్లోరిపైరిఫాస్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.