Anantapur : కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడి బెదిరింపుల వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నట్లు వీడియోలో ఉంది.

Anantapur : కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు

Mla Associate

MLA Kapu Ramachandra Reddy associate : అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడి బెదిరింపుల వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు.. ఓ కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. కనేకల్ నుంచి నల్లంపల్లి వరకు చేపట్టిన రోడ్డు పనులను ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా మొదలుపెడతారని ఆయన ప్రశ్నిస్తున్నాడు.

కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలో మీటర్ల రహదారి పనులు 17 కోట్ల నిధులతో డీఎంసీ సంస్థకు చెందిన వారు కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు చేస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు తనకు దక్కలేదని ఎమ్మెల్యే సన్నిహితుడు బెదిరింపులకు దిగాడు.

ఈ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న డీఎంసీ సంస్థ పనులను ప్రారంభించగా.. ఆ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే సన్నిహితుడు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు దక్కకపోవడం వల్లే బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.