AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో సీఐడీ సోదాలు

ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో సీఐడీ సోదాలు

ap cid (1)

AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలపైనే సోదాలు చేస్తున్నారు. ఈ రోజు (శనివారం) సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ సోదాలు నిర్వహించాయి. నారాయణ కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు పరిశీలించారు. పలు లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు.

నిన్న (శుక్రవారం) నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు

ఈ సోదాల్లో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలన్నింటీపై కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గతంలో మాజీ మంత్రి నారాయణ నివాసాలపై కూడా సీఐడీ అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి నారాయణ కుమార్తె నివాసంలోనూ ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.

అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ప్రధాన అభియోగాలతో గతంలో ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పలువురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పలువురి నివాసాల్లో సోదాలు చేశారు. నారాయణ కూతురిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె నివాసంలో కూడా నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఐడీ అధికారులు కంటిన్యూగా సోదాలు కొనసాగించారు.