AP Kodi pandalu : జనాలమీదకు దూసుకొచ్చి..వ్యక్తి ప్రాణాలు తీసిన పందెం కోడి

కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి దూసుకొచ్చిన ఓ పందెంకోడి వ్యక్తి ప్రాణం ప్రాణం తీసింది.

AP Kodi pandalu : జనాలమీదకు దూసుకొచ్చి..వ్యక్తి ప్రాణాలు తీసిన పందెం కోడి

Ap Kodi Pandalu

AP Kodi pandalu: సంక్రాంతి పండుగ వెళ్లిపోయా దాదాపు నెల రోజులు అవుతోంది. కానీ ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంకా కోడి పందాలు యదేచ్చంగాకొనసాగుతున్నాయి. ఈక్రమంలో చిత్తూరు జిల్లాలోని పెద్ద మండ్యం మండలం కలిచర్ల గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి ఓ పందెం కోడి దూసుకొచ్చింది. అలా దూసుకొచ్చిన కోడి కాలికి కట్టిన కత్తి తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అనూహ్యంగా క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు కోడి పందాల ప్రాంతంలోనివారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. షాక్ నుంచి కోలుకుని గాయపడిన వ్యక్తికి తీవ్ర రక్తస్రావం ప్రాణాలు కోల్పోవటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.

కాగా సంక్రాంతి పండుగ వెళ్లిపోయినా ఇంకా జిల్లాలో పలు ప్రాంతాల్లో జనాలు కోడిపందాలు నిర్వహిస్తున్నారు. కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం అంటూనే పండుగ వెళ్లిపోయినా సంప్రదాయం ముసుగులో ఈ పందాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదకర రీతిలో జరుగుతున్న ఈ పందాలకు చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామంలో గంగులయ్య అనే వ్యక్తి కోడి కత్తి తగిలి మృతి చెందాడు.

కోడి పందాలు వేసి చూట్టూ చేరిన జనం కోళ్లను ఉత్సాహపరుస్తు అరుస్తుంటారు.ఈక్రమంలో ఓ పందెం కోడి జనాలమీదకు దూసుకొచ్చింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో గంగులయ్యకు కోడికాళ్లకు కట్టిన కత్తి తగిలి తీవ్ర రక్తస్రావం కావటంతో ప్రాణాలు కోల్పోయాడు.