Minister Perni Nani : చట్టం అమలు అవుతుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి..?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు  పిల్లి మొగ్గలు వేస్తున్నారని  ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిపేర్ని నాని ఆరోపించారు.

Minister Perni Nani : చట్టం అమలు అవుతుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి..?

Perni Nani

Minister Perni Nani :  పవన్ కళ్యాణ్ సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు  పిల్లి మొగ్గలు వేస్తున్నారని  ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిపేర్ని నాని  ఆరోపించారు.  చట్టం అమలు అవుతుంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధం కావటంలేదని…తండ్రీ కొడుకులు సినిమాను రాజకీయాలకు  వాడుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

ఏపీలో చట్టం ప్రకారం ధియేటర్లు నడుచుకోవాలని చెప్పామని..థియేటర్ అనేవి నిబంధనల ప్రకారం నడుస్తాయి కానీ.. మీ ఇష్టం వచ్చినట్లు నడిపిస్తారా..అని నాని ప్రశ్నించారు. హై కోర్టు తీర్పు అన్నా.. ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదని.. ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సాహిస్తున్నాయని మంత్రి ఆరోపించారు.

డిమాండ్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన రేట్లు అమ్మితే అధికారులు అడ్డుకుంటారని మంత్రి తెలిపారు. ఏపీలో సినిమాని ప్రీ గా చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ కి బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకని మంత్రి ప్రశ్నించారు. సినిమా విడుదలకు ముందే జీవో 35 పై,   జాయింట్ కలెక్టర్ దగ్గరకి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హై కోర్టు ఆదేశించింది.  నిర్మాతలు కానీ, ఎగ్జిబిటర్లు కానీ ఎక్కడా జాయింట్ కలెక్టర్ కి దరఖాస్తు చేసుకోలేదని మంత్రి వివరించారు.

కొత్త జీవో విడుదల చేయడానికి పక్రియ జరుగుతోందని… ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ దశలో ఉందని మంత్రి తెలిపారు. అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈనెల 24 తేదీన జీవో రావాల్సి ఉంది. ఇంతలో మా మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో మేమంతా ఆవేదనలో ఉన్నాం అని నాని తెలిపారు.  సోమవారం కమిటీ సమావేశం జరుగుతుంది.. రిపోర్టు ఆధారంగా జీవో వస్తుందని,   భీమ్లానాయక్ సినిమాను మరోక వారం వాయిదా వేసుకుని ఉంటే సరిపోయేదని ఆయన అన్నారు.
Also Read : AP CM YS Jagan : సీఎం జగన్ మీద నిందలు వేస్తే.. వాడు 100 అడుగుల లోతులో పాతుకపోతాడు
చంద్రబాబు, లోకేష్ లకు పవన్ సినిమా పై ఉన్న ప్రేమ జూ.ఎన్టీఆర్ సినిమా పై ఎందుకు లేదని నాని అన్నారు.ఇండస్ట్రీ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడేకాదని…సినిమా బాగుంటే అందరి సినిమాలు చూస్తారని ఆయన అన్నారు.  జూ.ఎన్టీఆర్ సినిమా చూడాలని ఉందని ఎందుకు అనలేదని …. మీ ఎంపీ బావమరిది మహేష్, జూ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు చూడండి అని ఎప్పుడైనా లోకేష్  ట్విట్ చేసారా అని నాని లోకేష్ ను ప్రశ్నించారు.