AP Politics : రచ్చకెక్కితే వేటు తప్పదు.. వారికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

AP Politics : వైసీపీలోని అసమ్మతి నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైసీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

AP Politics : వైసీపీలోని అసమ్మతి నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైసీపీలో నేతల మధ్య విభేదాలు బహిర్గతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోసారి హద్దుమీరి రచ్చకెక్కితే ఎవరినైనా ఉపేక్షించేదే లేదన్నారు జగన్‌. ఏమైనా ఇబ్బందులుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేకానీ రచ్చకెక్కితే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని హెచ్చరించారు. పార్టీలో ఎక్కడైనా, ఎవరి మధ్యనైనా విభేదాలు తలెత్తితే వాటిని చక్కదిద్దే బాధ్యతను జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లకు అప్పగించారు సీఎం జగన్‌. అందరూ కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని… లేదంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

అందరం కలిసి కట్టుగా పనిచేయాలని… ఎలాంటి విభేదాలున్నా మర్చిపోయి అడుగులు ముందుకేయాలని సూచించారు జగన్‌. పార్టీలో ఎవరూ గీత దాటొద్దని… కాదని ముందుకెళ్తే చర్యలు తప్పవన్నారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని హెచ్చరించారు. ఎవరూ బహిరంగ విమర్శలు చేయవద్దన్నారు జగన్‌.

మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అక్కడక్కడా పార్టీపై అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. పలువురు నేతలు జగన్‌పై అలకబూనారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. ఆ తర్వాత వారందరినీ పార్టీనేతలు, సీఎం జగన్‌ బుజ్జగించారు. ఈ నేపథ్యంలో నిన్నటి సమావేశంలో ఏకంగా నేతలకు వార్నింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Read Also : YS Jagan Tour : నేడు విశాఖకు సీఎం జగన్.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ..!

ట్రెండింగ్ వార్తలు