APPSC Chairman : ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

APPSC Chairman : ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు

Appsc New Chairman Former Ap Dgp Gautam Sawang Takes Charge As Appsc Chairman

APPSC Chairman :  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సవాంగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగిన ఉదయ్‌భాస్కర్‌ పదవీకాలం 6 నెలల క్రితమే పూర్తయింది. అయితే అప్పటి నుంచి ఈ చైర్మన్ పోస్టు ఖాళీగానే ఉంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం డీజీపీ పోస్టు నుంచి సవాంగ్‌ను బదిలీ చేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌతమ్ సవాంగ్ 1986 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది సవాంగ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కొత్త పదవిలో గౌతమ్ సవాంగ్ ఐదేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు.

ఇటీవలే ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వైఎస్ జగన్ ప్రభుత్వం బదిలీపై కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2001-2003 సమయంలో సవాంగ్ వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. హోంగార్డు విభాగం డీఐజీగానూ ఆయన సేవలందించారు. 2003-2004 వరకూ ఎస్‌ఐబీ డీఐజీగా పనిచేశారు.

Appsc New Chairman Former Ap Dgp Gautam Sawang Takes Charge As Appsc Chairman (1)

Appsc New Chairman Former Ap Dgp Gautam Sawang Takes Charge As Appsc Chairman

2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా సవాంగ్‌ తన విలువైన సేవలందించారు. 2005-2008 వరకూ సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పనిచేశారు. 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా కూడా పనిచేశారు. డిప్యుటేషన్‌పై మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. గతేడాది జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ సవాంగ్‌కు డీజీపీగా బాధ్యతలు అప్పగించారు.

Read Also :  AP New DGP : ఏపీ నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. గౌతమ్ సవాంగ్‌‌కు వీడ్కోలు