Vishaka Blast: విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు.. ఆరుగురికి గాయాలు

విశాఖలో మరో పేలుడు సంభవించింది. అచ్యుతాపురంలోని అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో పేలుడు సంభవించింది.

Vishaka Blast: విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో పేలుడు.. ఆరుగురికి గాయాలు

Blast

Blast in Vishaka: విశాఖలో మరో పేలుడు సంభవించింది. అచ్యుతాపురంలోని అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో పేలుడు సంభవించింది. భయంతో కార్మికులు పరుగులు తీయగా.. పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఒక కార్మికుడికి చెయ్యి పూర్తిగా తెగిపోయింది. గ్యాస్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.

గ్యాస్ ఫిల్లింగ్ విభాగంలో ట్యాంక్ పేలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నమే ప్రమాదం జరిగినా రహస్యంగా ఉంచింది కంపెనీ యాజమాన్యం. అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోగా.. గ్యాస్ ఫిల్లింగ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తుంది.