AP : బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి డ్యాన్స్ చేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు.

AP : బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్

Ap Dy Cm Wife

Bullet Bandi Song: సోషల్ మీడియాను ‘బుల్లెట్ బండి’ ఇంకా ఊపేస్తుంది. నూతన వధువు ఈ సాంగ్ పై చేసిన స్టెప్స్  ఉర్రూతలూగించింది. ఇదే పాటకు మరికొంతమంది కొత్త కొత్త స్టెప్స్ వేస్తూ..సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ పాట ట్రెండింగ్ గా మారిపోయింది. సామాన్యుడి నుంచి మొదలు కొని…సెలబ్రెటీలు సైతం ఈ పాటకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. అంతేకాదు..వారు కూడా డ్యాన్స్ లు వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎంపీ కవిత ఈ పాటకు డ్యాన్స్ వేసిన సంగతి తెలిసిందే.

Read More : Maggi Milkshake: ‘మ్యాగీ మిల్క్‌షేక్’ వింత వంటకంపై..నెట్టింట్లో తిట్ల దండకం

తాజాగా…ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి డ్యాన్స్ చేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు. తిరుపతిలోని తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య  ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా…బుల్లెట్ బండి పాట వినిపించారు. మంత్రి సతీమణి సరదాగా డ్యాన్స్ చేశారు. భర్త ఎదుట డ్యాన్స్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది. సరదగా చేసిన ఈ డ్యాన్స్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.