Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే

Power Bills

Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. 6 వారాల్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

బిల్లులను తగ్గించి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు కొట్టేసింది. పీపీఏలకు వ్యతిరేకంగా ఏపీఈఆర్సీలో ప్రభుత్వం వేసిన పిటిషన్లను కూడా కోర్టు కొట్టేసింది. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ వేసిన పిటిషన్లను కూడా కొట్టివేసింది. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం జాప్యం చేసింది. ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సుమారు రూ.20 వేల కోట్ల బకాయిలు పడింది.