CM Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. ముఖ్యమంత్రి హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. CM Jagan

CM Jagan Delhi Tour

CM Jagan Delhi Tour : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. బిజీబిజీగా గడపనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. 6వ తేదీన వామపక్ష తీవ్రవాదంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే సమీక్ష సమావేశంలో జగన్ పాల్గొంటారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం కానున్నారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు వంటి పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్ కేసును కొట్టేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు చంద్రబాబు లాయర్లు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం ఈ నెల 9వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

Also Read..Pawan Kalyan: తనకు అందిన నోటీసులపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్

ఫైబర్ గ్రిడ్ స్కామ్ లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోనూ చంద్రబాబు ఏ-1గా ఉన్నారు. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కేసులోనూ సీఐడీ దూకుడు పెంచింది. అటు అంగళ్లు అల్లర్ల కేసులోనూ చంద్రబాబు ఏ-1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక, ఓటుకు నోటు కేసు కూడా మరోసారి తెరమీదకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఓటుకి నోటు కేసుని సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ భేటీ కానుండటం కీలకంగా మారింది.

Also Read..Atchannaidu: ఈ తేదీలోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారు: అచ్చెన్నాయుడు

ఇక ఏపీలో పొత్తు సమీకరణలు కూడా మారిపోతున్నాయి. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించేశారు. ఢిల్లీ పెద్దలతో భేటీ కాబోతున్న జగన్.. పవన్ కల్యాణ్ చేసిన ఈ పొత్తు స్టేట్ మెంట్ల పైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు