Andhra Pradesh : విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన 100 టన్నుల పురాతన పెట్టె..!

విశాఖ బీచ్ లోకి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకొచ్చింది. 100 టన్నుల బరువున్న ఈ చెక్కపెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు.

Andhra Pradesh : విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన  100 టన్నుల పురాతన పెట్టె..!

Huge Wooden Box Washed Up at Visakha beach

Huge Wooden Box Washed Visakha beach : విశాఖ బీచ్ లోకి ఓ బారీ పెట్టె కొట్టుకొచ్చింది. సముద్రంలోంచి కొట్టుకొచ్చిన ఈ పెట్టే పెద్ద మిస్టరీగా మారింది. దాదాపు 100 టన్నుల బరువున్న ఈ చెక్కపెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 29,2023) రాత్రి వైఎంసిఏ బీచ్ వద్దకు ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటానా స్థలానికి వచ్చిన పోలీసులు పెట్టెను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించగా వారు ఆర్కీయాలజీ విభాగానికి సమాచారం అందించారు.

ఈ చెక్క పెట్టె 100 టన్నుల బరువు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ పెట్టె రహస్యం ఛేదించేందుకు ఆర్కీయాలజీ విభాగానికి సమాచారం వెళ్లింది. వారు వచ్చి ఈ పెట్టెను ఓపెన్ చేయనున్నారు. దీంతో ఈ పెట్టె ఎక్కడ నుంచి కొట్టుకొచ్చింది, ఆ పెట్టెలో ఏముందనే ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ పెట్టె భారీగా ఉండటంతో పోలీసులు జేసీబీతో ఒడ్డుకు చేర్చారు. ఈ పెట్టెను చూసేందుకు జనాలు భారీగా తరలి వస్తున్నారు. ఆసక్తిగా గమనిస్తున్నారు.

Also Read: ఒక్కరోజే అవకాశం..! రూ. 2వేల నోట్ల డిపాజిట్‌కు ముగియనున్న గడువు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?