Chandrababu Naidu : 4 నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జమిలి అంటున్నారు. డిసెంబర్, జనవరిలోనే ఎన్నికలు వస్తాయంటున్నారు. సైకో పీడ విరగడైపోతుంది. Chandrababu Naidu - Rayadurgam

Chandrababu Naidu : 4 నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Naidu - Rayadurgam

Chandrababu Naidu – Rayadurgam : ఏపీలో 4 నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గతంలో 14ఏళ్ల పాటు తన పాలన చూశారని, మళ్లీ 4 నెలల్లో టీడీపీ పాలన చూస్తారని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రోడ్ షో లో పాల్గొన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జమిలి ఎన్నికలు అంటున్నారని, అయితే 6 నెలలు అంతకన్నా ముందే ఎన్నికలు రావొచ్చని చంద్రబాబు చెప్పారు.

Also Read..Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

”సైకో, చిన్న సైకో.. ఇక, మీ పని అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి. 14ఏళ్లు నా పాలన చూశారు. మళ్లీ 4 నెలల తర్వాత నా పాలనే చూస్తారు. నేను ఎంతో నమ్మకంగా చెబుతున్నా ఈ రాయదుర్గంలో. వచ్చేది తెలుగుదేశం పార్టీనే. నా బలం, నా సైన్యం యువతే. మా నమ్మకం, మా ఆశ నువ్వు అని యువత అంటోంది. ఇక కేవలం 6 నెలలే. ఇంకా ముందే ఎన్నికలు రావొచ్చు. జమిలి అంటున్నారు. డిసెంబర్, జనవరిలోనే ఎన్నికలు వస్తాయంటున్నారు. సైకో పీడ విరగడైపోతుంది. అందుకే, మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు వచ్చినా తెలుగుదేశం జెండా చూపించండి” అని పిలుపునిచ్చారు చంద్రబాబు.