Kodali Nani : సీఎం జగన్ పై సినిమా తీయాలన్న పవన్ ట్వీట్ కు కొడాలి నాని కౌంటర్

నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్ గా నటింప చేయాలన్నారు.

Kodali Nani : సీఎం జగన్ పై సినిమా తీయాలన్న పవన్ ట్వీట్ కు కొడాలి నాని కౌంటర్

Kodali Nani-Pawan Kalyan

Kodali Nani counter Pawan Kalyan : సీఎం జగన్ పై సినిమా తీయాలని పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ పవన్ కల్యాణ్ ట్వీట్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో చంద్రబాబును విలన్ గా నటింప చేయాలన్నారు. చంద్రబాబుకు 420 అసిస్టెంట్లుగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

అవసరమైతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మాట్లాడుతానని, వర్మ డైరెక్షన్ చేస్తారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత హీరో లాంటి జగన్, ప్రతిపక్షాల నేతలందరినీ నడిరోడ్డుపై నిలబెడతాడని చెప్పారు. ఎన్నికల తర్వాత పవన్ పవన్ కల్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలేనని ఎద్దేవా చేశారు.

Pawan Kalyan : ‘పాపం పసివాడు’ సినిమాని సీఎం జగన్‌తో తీస్తే బాగుండు .. ఎందుకంటే ఆయన చాలా అమాయకుడు

సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు వేశారు. ‘పాపం పసివాడు సినిమాను మన సీఎంతో ఎవరైనా తీస్తారని ఆశిస్తున్నానంటూ’ వి.రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబర్ 29న విడుదలైన చిత్రం పోస్టర్ ను కూడా పవన్ పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. ‘మన సీఎం చాలా అమాయకుడు’ అంటూ పేర్కొన్నారు.

‘ప్రియమైన సీఎం మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా తరిమెల నాగిరెడ్డి కాదు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘క్లాస్ వార్ అనే పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు మీకు లేదు’ అంటూ సెటైర్లు విసిరారు. ‘ఏదో ఒక రోజు మీ నుంచి మీ గుంపు బారి నుంచి రాయలసీమ విముక్తి అవుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.