Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి

రెండో ఘాట్ రోడ్డులోంచి  విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై   వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి

Leopard Attack On Tirumala Ghat Road

Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి చేసింది. రెండో ఘాట్ రోడ్డులోంచి  విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై   వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
Also Read : ORR LED Lights : ఓఆర్ఆర్ పై ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించనున్న కేటీఆర్
సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంబులెన్స్ లో ఇద్దరినీ తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. చిరుత  రోడ్డు దాటే క్రమంలో ఇద్దరూ బైక్ పై రావటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని వీజీవో బాలారెడ్డి అన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం ఎక్కువయ్యిందని… ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.