YS Viveka Case : సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి .. కార్యాలయం వద్ద భారీ బందోబస్తు.. అరెస్ట్ తప్పదా?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మరి సీబీఐ విచారణ తరువాత ఏం జరుగనుంది. కేవలం విచారణేనా? లేదా అరెస్ట్ అనివార్యమా?

ycp mp avinash reddy viveka case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మే 16న అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాల రీత్యా నాలుగు రోజులు గడువు కోరారు. దానికి సీబీఐ అంగీకరిస్తునే 19న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆ గడువు ఈరోజుతో పూర్తి అయ్యింది. దీంతో ఈరోజు అవినాశ్ సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోనే సీబీఐ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వాతావరణం చూస్తుంటే ఇక అవినాశ్ రెడ్డి అరెస్ట్ అనివార్యమా? అనే టెన్షన్ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి,ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి చంచల్ గూడ జైలులోనే ఉన్నారు.

Supreme Court Surprise : గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ ఆరు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్‌ విచారణకు గైర్హాజరయ్యారు. కానీ ఈరోజు విచారణకు కచ్చితంగా హాజరుకావాల్సి ఉండగా ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈకేసులో అత్యంత కీలక నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇటు హైకోర్టు ,అటు సుప్రీంకోర్టుల చుట్టు తిరుగుతున్నారు. కానీ ఎక్కడా ఊరట లభించటంలేదు. ఊరట లభిస్తే బహుశా అవినాశ్ సీబీఐ విచారణకు ధైర్యం హాజరయ్యేవారేమో. కానీ అన్ని విధాలుగా దారులు మూసుకుపోవటంతో అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు రావటానికే భయపడుతున్నట్లుగా ఉంది అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో. దీంట్లో భాగంగానే 16న విచారణకు రాకుండా ముందస్తు షెడ్యూల్ ఉందని సాకు చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా విచారణ తేదీ ఖరారు కాలేదు.

YS Viveka Case : సీబీఐ ముందు విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి అనుచరులు వీరే..

ఈ పరిణామాలతో ఈరోజు సీబీఐ విచారణకు వస్తే అరెస్ట్ అనివార్యమా? లేదా గతంలో వలెనే విచారించి పంపేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. విచారణకు హాజరయ్యేందుకు అవినాశ్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ కు బయల్దేరినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సీబీఐ పిలిచిన ప్రతీసారి అవినాశ్ రెడ్డి కోర్టులో పిటీషన్ వేస్తూ..గడువు కోరుతూ విచారణను జాప్యం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీత న్యాయస్థానానికి వివరించారు. అటు సీబీఐ ఎంపీ అవినాశ్ పై కీలక అభియోగాలు నమోదు చేసింది. పులివెందుల నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి తన అనుచరులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరగనుందో వేచి చూడాలి..

Supreme Court Surprise : గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

 

ట్రెండింగ్ వార్తలు