Naga babu: ఏ పనీ లేనోడు పిల్లి తల గొరిగినట్టు అంటూ నాగబాబు సెటైర్లు.. సరిపోయారు ముగ్గురూ అంటూ నందిగం సురేశ్ ఎద్దేవా

ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని నాగబాబు అన్నారు.

Naga babu: ఏ పనీ లేనోడు పిల్లి తల గొరిగినట్టు అంటూ నాగబాబు సెటైర్లు.. సరిపోయారు ముగ్గురూ అంటూ నందిగం సురేశ్ ఎద్దేవా

Naga babu

Naga babu – ChiranJeevi: మెగాస్టార్ చిరంజీవిపై మండిపడుతున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రులకు జనసేన (JanaSena) నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సినీ పరిశ్రమ గొప్పదనం ఏంటో, ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటో చెబుతూ ట్వీట్ చేశారు.

” శ్రమని పెట్టుబడిగా పెట్టి.. పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో పాటు కట్టి, వినోదాన్ని, విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ. ఏ పనీ లేనోడు పిల్లి తల గొరిగినట్టు.. నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు..

ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు.
బటన్ నొక్కి రూ.కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా?

అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ ధౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి శుభం కార్డు పడే రోజు దగ్గర్లోనే ఉంది.. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది. ఆరోగ్యాలు జాగ్రత్త ” అని నాగబాబు అన్నారు.

నందిగం సురేశ్ కౌంటర్

నాగబాబుకి వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ కౌంటర్ ఇచ్చారు. ” నాగబాబు.. ఒకమాట.. మీ అన్న చిరంజీవి గారిని చూసి పార్టీ పెట్టి టైం చూసి షట్టర్ ఎలా దించాలో చూసి నేర్చుకోవచ్చు.. మీ తమ్ముడ్ని చూసి పార్టీ పెట్టి ఎలా తాకట్టు పెట్టాలి ఊడిగం ఎలా చెయ్యాలి అని నేర్చుకోవచ్చు.. ఇక వీళ్లకి వత్తాసు పలికే నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలో? సరిపోయారు ముగ్గురూ.. ” అంటూ ఇచ్చారు.

HBD Mahesh Babu: ఇందుకే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.. లేకపోతేనా..