Police: పది నిమిషాల్లో పోయిన ఫోన్ పట్టేసుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పోయిన ఫోనును పది నిమిషాల్లో పట్టుకున్నారు పోలీసులు.

Police: పది నిమిషాల్లో పోయిన ఫోన్ పట్టేసుకున్న పోలీసులు

Phone (1)

Police Caught lost phone: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పోయిన ఫోనును పది నిమిషాల్లో పట్టుకున్నారు పోలీసులు. అవనిగడ్డ నుంచి మచిలీపట్నం వచ్చిన ఓ యువతి కోనేరుసెంటరులో తన ఫోను పోగొట్టుకుంది. వెంటనే పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వగా.. వెంటనే రంగంలోకి దిగిన ఆర్‌పేట సీఐ భీమరాజు టెక్నాలజీ వినియోగించి, లొకేషన్‌ గుర్తించారు. సిబ్బంది అక్కడకు వెళ్లి ఆరా తీయగా ఓ వ్యక్తి ఫోను తనకు దొరికిందని పోలీసులకు ఇవ్వగా.. ఫోన్‌ను యువతికి అందజేశారు.

పది నిమిషాల వ్యవధిలోనే మొబైల్‌ను తిరిగి అందించడంపై ఆ యువతితో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే స్పందించి రంగంలోకి దిగి ఫోన్ కనిపెట్టిన సీఐతో పాటు ఎస్సై అనూష, కానిస్టేబుళ్లు నాగరాజు, కృష్ణలను డీఎస్పీ మాసుంబాషా అభినందించారు.