Andhra-pradesh : లేడీ కానిస్టేబుల్ కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో మహిళా కానిస్టేబుల్ విషయంలో కానిస్టేబుల్ సీఐ ఘర్షణ పడ్డారు.

Andhra-pradesh : లేడీ కానిస్టేబుల్ కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్

Police Ci And Constable Clash For Women Constables In Ap

 

Police CI-constable clash for women constables : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో మహిళా కానిస్టేబుల్ విషయంలో కానిస్టేబుల్ సీఐ ఘర్షణ పడ్డారు.మాటా మాటా అనుకున్నారు. అటువైపు ఉన్నది తన పై అధికారి సీఐ అని కూడా చూడలేదు సదరు కానిస్టేబుల్. గొడవపడ్డాడు. ఘర్షణ పడ్డాడు. కొట్టుకున్నట్లుగా కూడా సమాచారం. ఓ లేడీ కానిస్టేబుల్ కోసం పోలీసులు గొడవపడ్డారని తెలిసిన ఉన్నతాధికారులు సీఐ, కానిస్టేబుల్ పై సీరియస్ అయ్యారు.

భీమవరం వన్ టౌన్ సీఐ కృష్ణభగవాను కానిస్టేబుల్ రాజేష్ మధ్య అదే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్ విషయంలో రెండు రోజుల క్రితం వివాదం తలెత్తి ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న ఉన్నత అధికారులు విచారణ చేపట్టి శ్రీకృష్ణ భగవాను విఆర్ కు పంపారు.

ఈ విషయం తెలిసి పబ్లిక్ నవ్వుకునేలా ఉంది పోలీసుల వ్యవహారం. గొడవలు జరిగితే సర్ది చెప్పాల్సిన పోలీసులు అధికారులే గొడవం పడటం ఏంటని నవ్వుతున్నారు జనాలు. అది కూడా ఓ లేడీ కానిస్టేబుల్ కోసం..ఒంటిమీద ఉన్నది ఖాకీ డ్రెస్ అని మర్చిపోయారేమో..డ్యూటీలో ఉండగానే కొట్టుకున్నారనే సమాచారంతో జనాలు షాక్ అవుతున్నారు. పర్సనల్ విషయాలుంటే బయట చూస్కోకుండా పోలీస్ స్టేషన్ లో గొడవపడటానికి కనీసం ఇంగితంలేదా అనుకుంటున్నారు.