Viral News: వింత కోడిపుంజు.. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది!

మన సమాజంలో అప్పుడప్పుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా కొన్ని వింతలు జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఓ వింత అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కోడిపుంజు తానే గుడ్లు పెట్టి.. వాటిని పొదిగి పిల్లల్ని చేసి వాటిని కంటికి రెప్పలా కాపాడుతుంది.

Viral News: వింత కోడిపుంజు.. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది!

Viral News

Viral News: మన సమాజంలో అప్పుడప్పుడు సృష్టి ధర్మానికి విరుద్ధంగా కొన్ని వింతలు జరుగుతుంటాయి. చంపుకుతినే క్రూర మృగాలు సాధు జంతువులుగా మారడం, వింత వింత శిశువుల జననం, పందులు ఆవు పాలు తాగడం లాంటి వింతలు అప్పుడప్పుడు మనం వింటుంటాం. ఇలాంటివి చూసినప్పుడే కలికాలంరా బాబు అనుకుంటాం. మరికొందరైతే వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని అంటుంటారు.

అలాంటిది ఇప్పుడు ఓ వింత అందరినీ ఆకట్టుకుంటుంది. సహజం కోడిపుంజు ఎలా ఉంటుందో.. ఏం చేస్తుందో మన అందరికీ తెలిసిందే. వేకువజామున నిద్రలేపే కోడిపుంజు కొన్నిచోట్ల కత్తి కట్టించుకొని పందేలకు దిగుతుంది. ఇది కాకుండా పెట్టలతో కలిసి అవి గుడ్లు పెట్టేలా సహకరిస్తుంది. ఇది సృష్టి ధర్మం. కానీ ఈ కోడిపుంజు మాత్రం తానే గుడ్లు పెట్టి.. వాటిని పొదిగి పిల్లల్ని చేసి వాటిని కంటికి రెప్పలా కాపాడుతుంది.

ఏపీలోని చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామంలోని ఎస్టీకాలనీలో ఉంటున్న సబ్రహ్మణ్యం అనే వ్యక్తికి చెందిన ఓ కోడిపుంజు ఏకంగా గుడ్లు పెట్టేస్తూ పిల్లల్ని పొదుగుతోంది. ఓ రోజు అది గుడ్లుపెట్టడం గమనించిన సుబ్రహ్మణ్యం ఆసక్తిగా దాన్ని మరింత గమనించాడు. మొత్తం పుంజులాగానే ఉన్నా అది పెట్ట కోడి మాదిరే గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని చేయడమే కాకుండా వాటిని కంటికి రెప్పలా చూసుకుంటోంది.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా తిరిగి ఇప్పుడు ఈ కోడిపుంజు పెద్దకన్నెలి గ్రామంలో ఓ సెలబ్రెటీ అయింది. ఈ వింత పుంజును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతుంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఈ పుంజును చూసి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు. కాగా కోడిపుంజు గుడ్లు పెట్టడంపై పశుసంవర్ధక అధికారులను సంప్రదించగా జన్యులోపం వల్ల ఇలా గుడ్లుపెడతాయని.. ప్రస్తుతం ఆ కోడిపుంజు ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.